Ramabahadra Rara

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా
రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

ముద్దుముద్దుగారగ నవమోహనాంగ రారా
ముద్దుముద్దుగారగ నవమోహనాంగ రారా
అద్దపు చెక్కిళ్ళ వాడ అంబుజాక్ష రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

మంచి ముత్తెముల మెరయుచుండ రారా
మంచి ముత్తెముల మెరయుచుండ రారా
పంచదార చిలక నాతొ పలుకుదువు రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

నా యెడల దయజూచి నల్లనయ్య రారా
నా యెడల దయజూచి నల్లనయ్య రారా
బాయకనేప్పుడు నీ బంటునయ్య రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

ముజ్జగములకునాది మూల దుంప రారా
ముజ్జగములకునాది మూల దుంప రారా
గజ్జల చప్పుళ్ళు ఘల్లుఘల్లుమనగ రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

అందెలు రవళి చేత సందడించ రారా
అందెలు రవళి చేత సందడించ రారా
కుందనపు బొమ్మ ఎంతో అందగాడ రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

పట్టరాని ప్రేమ నా పట్టుగొమ్మ రారా
పట్టరాని ప్రేమ నా పట్టుగొమ్మ రారా
గట్టిగా కౌసల్య ముద్దుపట్టి వేగ రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

నిన్ను మానలేనురా నీలవర్ణ రారా
నిన్ను మానలేనురా నీలవర్ణ రారా
కన్నుల పండువుగా కందు కన్నతండ్రి రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

మనవి చెంపుకొందుగాని మరవకిందు రారా
మనవి చెంపుకొందుగాని మరవకిందు రారా
మనసు నిమిదనేగాని మరలేదెందు రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా

సామగానలోల నా చక్కనయ్య రారా
సామగానలోల నా చక్కనయ్య రారా
రామదాసునేలిన భద్రాద్రివాస రారా
రామదాసునేలిన భద్రాద్రివాస రారా

రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా
రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా



Credits
Writer(s): S P Balasubramniam
Lyrics powered by www.musixmatch.com

Link