Ee Gopemma

ఈ గోపెమ్మ నోచింది నోమంట
ఆ గోపయ్య పుట్టింది మా ఇంట
ఏ యోగమో ఏ బంధమో
ఏ పాశమో మా పాపగా
ఊయలూగెనమ్మ కంటి పాప
ఈ గోపెమ్మ నోచింది నోమంట
ఆ గోపయ్య పుట్టింది మా ఇంట

కడుపెన్నడు పండదని
కన్నీరిక ఎండదని
ఎడారిలో వసంతమైనావు
ఇది ఏ బ్రహ్మ శుభాశీసురా
గతమన్నది కట్టు కథ
నిజమైనది కన్న కల
నిరాశలో వరానివైనావు
ఇక జీవించు శతాయుషుగా
ఆ దేవకి కంటి వెలుగు
నందుని ఇంట
తప్పటడుగు వెయ్యగానే తాండవమంట
ఇంటి చందమామ చంటి పాప

ఈ గోపెమ్మ నోచింది నోమంట
ఆ గోపయ్య పుట్టింది మా ఇంట
ఏ యోగమో ఏ బంధమో
ఏ పాశమో మా పాపగా
ఊయలూగెనమ్మ కంటి పాప



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Koteswara Saluri
Lyrics powered by www.musixmatch.com

Link