Oppuko Sundari

ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా

కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా

పిట పిట లాడే పిట్టా అట్టే
సతాయించకే యదలో ఇదే తీర్చవే

చిట పట లాడే నీ సందిట్లో
నిషా పంచరా ఆపై శృతే మించరా

(కసి లేపుతోంది కైవారం)
(ఉసి గొలుపుతోంది సింగారం)
(చెయ్యలనుందిలే నేరం)

అరె ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా

కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా

ఓ తూనీగా నీ నడుము మడతలకు
తకిట తకిట తక తాళం వేస్తా ఠీవిగా

ఓ తేనీగా నీ చిలిపి పిలుపువిని
తళుకు బెళుకు లకు తాళం తీస్తా నాజూగ్గా

నువ్వు ఆమాత్ర మిస్తే చాలు చొరవా
ఇక చెప్పాల చూడు మన తెగువా

కొత్త ఇబ్బంది ఎక్కువాయే గురువా
కాస్త తగ్గించి పెట్టుకుంటే గొడవ

కువ కువ లాడే అవసరమేదో
గ్రహించానుగా కనుకే ఇటొచ్చానుగా

గుబ గుబ లాడే కోరిక లేవో
గుబాలించెరా నిన్నే వరించానురా

తగు చీకటిచ్చే సాయంత్రం
తెగ స్వాగతించె ఏకాంతం
ఇక సొగసు తీయు స్వాతంత్ర్యం

కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా

అరె ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా

ఏం చేస్తావో చెయ్ పడుచు బరువులకు
పరువు నిలపగల సాయం చేసే ఘనకార్యం

నే చూస్తాగా నీ ఎగుడు దిగుడులకు
తగిన కౌగిలితో వంతెన గట్టే వ్యవహారం

హోయ్ మొత్తంగ ఈడు చేత బెడతా
సిగ్గు వద్దంటే దాన్ని వెల్లగొడతా

తిక్క తీరంగ అల్లి సుఖ పెడతా
హక్కు పొందంగ తాళిబొట్టు కడతా

నిగ నిగ లాడే నా సుకుమారం
తరించేట్టుగా నీకే తల్లోంచేయనా

ఎవరెవరంటూ వెతికే ప్రాయం
మొరాలించనా మురెపం ప్రసాదించినా

(నులి వెచ్చనైనా నయగారం
అర విచ్చు కున్న మందారం
అందించుకొన బహుమానం)

అహ ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా

కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా

పిట పిట లాడే పిట్టా అట్టే
సతాయించకే ఎదలో ఇదే తీర్చవే

చిట పట లాడే నీ సందిట్లో
నిషా పంచరా ఆపై శృతే మించరా

(కసి లేపుతోంది కైవారం)
(ఉసి గొలుపుతోంది సింగారం)
(చెయ్యలనుందిలే నేరం)



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link