Koyelamma Konalona

రావే రావే అత్తా
పిల్లల్ దేశం అత్తా
నిన్నేం చేయనత్తా
అసలే నాకు కొత్త
ఒసే ఇప్పుడే ఏమైందిలే
ముందు ఉన్నదే ముసళ్ళ పండగే
మల్లె మొగ్గలన్నీ పక్క మీద దింపుటే
ఇంక తెల్లవార్లూ కొక్కరుక దంపుడే
హే హేహే ఆపండే ఆపండి
ఎందెహే గాడిద గొంతులేసుకొని
మీరు మీ పాట
పాట పాడితే ఎట్టుండాల
ముద్ద బంతి పూసినట్టుండాల
పండు వెన్నెల కాసినట్టుండాల
ఇనుకోండి అహహా
కోయిలమ్మ కోనలోన మల్లే పూసింది
జాబిలమ్మ తోటలోన జాజే విరిసింది
హే హే హే వెన్నెల్లో గోదారమ్మ
పైటే వేసింది హా
కన్నుల్లో తొలి సిగ్గమ్మ
తొంగే చూసింది
మంచి గంధమే పూయరే అమ్మలాల
మన్నె గాజులే వెయ్యరే కొమ్మలాల
దిష్టి చుక్కనే పెట్టరే భామలాల
తీపి చిమ్మిరే కొట్టరే లేవలాల
కోయిలమ్మ కోనలోన మల్లే పూసింది
జాబిలమ్మ తోటలోన జాజే విరిసింది

అబ్బో చిలకమ్మకింత సిగ్గ
మందారపూల మొగ్గ
కందేను చూడు ఆ బుగ్గ
చంప - చక్కాని ముద్దు
గుమ్మ - ఆ కొండాపల్లి
బొమ్మ - ముత్యాలపళ్ళ
రాధమ్మ
పిల్ల నవ్విందంటే వెన్నెలొచ్చినట్టే
గుచ్చి చూసిందంటే పిచ్చి పట్టినట్టే
బొట్టు పెట్టిందంటే పొద్దు పొడిచినట్టే
కొప్పు ముడిచిందంటే కొంప మునిగినట్టే
ఆ బ్రహ్మ వేవేల అందాలు చందాలు
కలబోసి చేశాడు ఈ ఇంటి పూబంతిని
కోయిలమ్మ కోనలోన మల్లే పూసింది
జాబిలమ్మ తోటలోన జాజే విరిసింది
ఆహా వెన్నెల్లో గోదారమ్మ
పైటే వేసింది
కన్నుల్లో తొలి సిగ్గమ్మ
తొంగే చూసింది

అల్లో నేరేళ్ల వంటి కళ్ళు
లేజుంటి తేనె తిళ్ళు
ఈ చిన్నదాని కౌగిళ్ళు
అమ్మో - బంగారమంటి
ఒళ్ళు - చూస్తేనే గుండె
ఝల్లు - నోరూరిపోయే
ఉవిళ్ళు
పిట్ట కూత పెట్టే
పైట కన్ను కొట్టే
నడుము పాదు కొచ్చే
పరువం పంట పండే
ముద్దు మూట కట్టే
మూట గూట్లో పెట్టే
ఏలే మొగుడే వస్తే
మూట గొల్లినట్టే
వయ్యారి ఒళ్ళోని వడ్డాణమైపోయి
వరహాన వయసంతా దోచేటి వరుడెవ్వడో
కోయిలమ్మ కోనలోన మల్లే పూసింది
జాబిలమ్మ తోటలోన జాజే విరిసింది
ఆహహ వెన్నెల్లో గోదారమ్మ
పైటే వేసింది
కన్నుల్లో తొలి సిగ్గమ్మ
తొంగే చూసింది
మంచి గంధమే పూయరే అమ్మలాల
మన్నె గాజులే వెయ్యరే కొమ్మలాల
దిష్టి చుక్కనే పెట్టరే భామలాల
తీపి చిమ్మిరే కొట్టరే లేవలాల
కోయిలమ్మ కోనలోన మల్లే పూసింది
జాబిలమ్మ తోటలోన జాజే విరిసింది



Credits
Writer(s): Vidya Sagar, Sahithi
Lyrics powered by www.musixmatch.com

Link