Navvavayya Babu

నవ్వవయ్య బాబూ
నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది
నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది
నవ్వు దొరబాబూ
అరె నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది
అరె నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది
ఆడదిలా వెంటపడి అడుగుతుండగా
మూతినలా ముడుచుకుని ఎంతసేపటా
తెగ ఉరిమిన ఆకశాన నవ్వు చినుకులే, నవ్వు చినుకులే
ఓయ్ పెదబాబు
నవ్వవయ్య బాబూ
నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది
నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది

మూటలే తరిగేనా, కోటలే కూలేనా
నవ్వితే ఓసారి, కొంపలే మునిగేనా
వింతలే జరిగేనా, ఇంతలో ఏవైనా
నవ్వితే మనసారా, కొండలేం కరిగేనా
నేను చూడలేదురోయ్ నువ్వు నవ్వగా
అంత కోపమెందుకోయ్ వరుసకు బావా
ఇదిగో ఈవేళ నవ్వాలా పకపకమని కిలకిలమని కాకుల రొదలా
ఏయ్ ఏంటీ?
కోకిలా శృతిలా
నవ్వవయ్య బాబూ
నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది
నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది

మణులే అడిగానా, మాన్యాలడిగానా
నవ్ తప్ప ఏమైనా, నిన్ను నేనడిగానా
నగలే అడిగానా, నాణ్యాలడిగానా
చిన్న నవ్వు కాకుండా, చీరలే అడిగానా
దాచుకోకు నవ్వునీ పెదవి చాటున
ఫక్కుమంటు నవ్వితే చాలనుకోనా
చెబుతా వింటావా ఇపుడైనా పడిపడి నువ్వు నవ్వర మరి నా అత్తకొడకా
ఒళ్ళెలా ఉందే?
కాదని అనక
ఒరేయ్ పెదబాబు
నవ్వు దొరసాని
చిరునవ్వుల సవ్వడితో, నువ్వు సందడి చెయ్యాలి
చిరునవ్వుల సవ్వడితో, నువ్వు సందడి చెయ్యాలి
నవ్వు నీలవేణి
కొంటెనవ్వుల పల్లకిలో, నిన్ను రోజూ చూడాలి
కొంటెనవ్వుల పల్లకిలో, నిన్ను రోజూ చూడాలి
నిత్యమల్లెపువ్వులాగ నువ్వు ముద్దుగా
నవ్వుతుంటే ముత్యమైన సాటిరాదుగా
గలగలమని నవ్వుతుంటే నాకు పండగ, నాకు పండగ



Credits
Writer(s): Chakri, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link