Changu Changu Muddadanga

చెంగు చెంగు ముద్దాడంగా
చల్ మోహనరంగ చెంగున దూకేయ్ వయ్యారంగా
తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగా
చల్ మోహనరంగ కొంగే దోచేయ్ శృంగారంగా
ఈ ముద్దుల దొంగ
చెంగు చెంగు ముద్దాడంగా
చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా
ఈ ముద్దుల దొంగ

అందాలు దాచిపెట్టి ఊరిస్తే పాపం
అందిస్తే తీరుతుంది సందిట్లో తాపం
ఒళ్ళంతా కళ్ళు చేసి వెయ్యద్దు బాణం
ముల్లంటి చూపుతోటి తియ్యద్దు ప్రాణం
వయసేమో రేగుతుంది చక చక్క చమ్మ చక్క
మనసేమో ఆగమంది చక చక్క చమ్మ చక్క
ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు
పందిట్లో మోగనీవోయ్ పెళ్ళి భాజాలు
అబ్బ ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు
పందిట్లో మోగనీవోయ్ పెళ్ళి భాజాలు
ఈ పొద్దే మన ముద్దు ఇక హద్దు పద్దు వద్దే వద్దు
చెంగు చెంగు ముద్దాడంగా
చల్ మోహనరంగ చెంగున దూకేయ్ వయ్యారంగా
తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగా
చల్ మోహనరంగ కొంగే దోచేయ్ శృంగారంగా
ఈ ముద్దుల దొంగ

గారాలు పొంగు వేళ గోరంత ముద్దు
కోరింది కొంగు జోల గోరింట పొద్దు
చీరల్లె చుట్టెనమ్మ నీ చూపు నేడు
ఆరాలే తీసెనమ్మ మారాల ఈడు
తియ్యంగ కొంటె దొంగ చక చక్క చమ్మ చక్క
తీరాలి సామిరంగ చక చక్క చమ్మ చక్క
చుక్కల్నే దూసి నీకు హారమేసేనా
అందాల కన్నె సోకు హారతిచ్చేన
అరె చుక్కల్నే దూసి నీకు హారమేసేనా
అందాల కన్నె సోకు హారతిచ్చేన
సందళ్ళు పందిళ్ళు ఈ అల్లరి మల్లెల జల్లుల్లోన
చెంగు చెంగు ముద్దాడంగా
చల్ మోహనరంగ చెంగున దూకేయ్ వయ్యారంగా
తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగా
చల్ మోహనరంగ కొంగే దోచేయ్ శృంగారంగా
ఈ ముద్దుల దొంగ



Credits
Writer(s): K V Mahadevan, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link