Manasannade Ledu

మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు
పైనుండి పాలించు ఓ దైవమా
విధి రాత ఎదకోత నీ నైజమా
ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మ
ఇది నీకు తుదిలేని చదరంగమా

నీ ప్రాణమే చెలిగా భావించి నీవు
నీ గుండెలో తనను కొలువుంచినావు

ఆ ప్రేమనే తెలుసుకోలేని తాను
ఎంచేతనో తుదకు బలి చేసే నిన్ను
లోకాన నిజమైన ప్రేమన్నది
చూసేందుకే జాడ కరువైనది
నీ ప్రేమ నిజమైతే నెగ్గేది నీవే
ఈ మాట ఇకపైన నమ్మాలి నువ్వే
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు

స్నేహానికే విలువ మారింది నేడు
నీ మంచికి జరిగే ఎనలేని కీడు

ద్రోహానికే కలదు లోకాన పేరు
స్వార్థానిదే గెలుపు ఇది నేటి తీరు
కన్నీట బరువైన నీ కళ్ళతో
ఈ మౌన పోరాటమెన్నాళ్ళులే
నీదన్నదేనాడు చేజారిపోదు
లేదంటే అది నీకు దక్కేది కాదు
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు
ఎదురీత రాశాడు నీ జన్మకు
పైనుండి పాలించు ఓ దైవమా
విధి రాత ఎదకోత నీ నైజమా
ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మ
ఇది నీకు తుదిలేని చదరంగమా



Credits
Writer(s): S.a.raj Kumar, Kaluva Krishna Sai
Lyrics powered by www.musixmatch.com

Link