Putthadi Bommanti

పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల
ఊరంత చేరి ఉప్పొంగి పోయే పండుగ అయ్యేలా
మా కంటి పాపకి జోజోలు పాడే గారాల ఉయ్యాల
మబ్బులలో జాబిలి మా సొంతమయ్యేలా
సందడితో మా ఎదలే సంద్రమయ్యేలా
(ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి వింది రామా లాలి మేఘశ్యామా లాలి)
(రామా లాలి మేఘశ్యామా లాలి)
జో జోజోజో జో జోజోజో
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల

నీ నవ్వుల్లో సిరి జల్లు కురిసిందిరా
నీ అల్లరిలో హరివిల్లు విరిసిందిరా

మా ముంగిళ్ళో రేపల్లె వెలసిందిరా
తనే పాపల్లే ఈ తల్లి మురిసిందిరా
నా ఒడిలో ఒదిగి మైమరపించరా
నువు త్వరగా ఎదిగి నను అమ్మా అనరా
ఆ పిలుపే నా హృదయానికి ఉయ్యాల
(ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి వింది రామా లాలి మేఘశ్యామా లాలి)
జో... పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల
జో... పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల

ఈ కోటంతా ఇన్నాళ్ళు చినబోయెరా
ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా

నీ చేతుల్లో బొమ్మలుగా ఉంటామురా
నువ్వు ఊరేగే అంబారి అవుతామురా
నా పాలే తాగి నను పాలించరా
మా పది ప్రాణాలు నీలో పెంచరా
మా జతకే నువు ఊపాలి జంపాల
(ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి వింది రామా లాలి మేఘశ్యామా లాలి)
జో... పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల
జో... పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల
లాలల లాల లాలల లాల లాలల లాల లా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల

Credits
Writer(s): Chembolu Seetharama Sastry, S V Krisna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link