Maa Muddu Radhamma

(మా ముద్దు రాధమ్మ రాగాలే శ్రీ మువ్వ గోపాల గీతాలు)
(ఆ చెయ్యి ఈ చెయ్యి తాళాలు అనురాగాలలో గట్టి మేళాలు)

మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చెయ్యి ఈ చెయ్యి తాళాలు
అనురాగాలలో గట్టి మేళాలు
మా ముద్దు రాధమ్మ రాగాలే

నువ్వందం
నీ నవ్వందం
తల్లో
మల్లె పువ్వందం
కట్టందం
నీ బొట్టందం
నువ్వు తిట్టే తిట్టే
మకరందం
సూరీడు చుట్టూ భూగోళం
రాధమ్మ చుట్టూ గోపాలం
సూరీడు చుట్టూ భూగోళం
రాధమ్మ చుట్టూ గోపాలం

నడుము ఆడితే కథాకళి

జడే ఆడితే కూచిపూడి

తలే ఆడితే ఫలానా తధిం తాధి తిల్లాన
మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చెయ్యి ఈ చెయ్యి తాళాలు
అనురాగాలలో గట్టి మేళాలు

కూరలు తరిగే కూరిమి ఇష్టం

చేతులు తెగితే మూతుల కిష్టం

ముద్దలు కలిపి పెడితే ఇష్టం
ముద్దుల దాకా వెళితే
వలచిన వారి పరాకు అందం
గెలిచిన సతి పై చిరాకు అందం
కోప తాపముల కోలాటంలో మనసు ఒక్కటే మాంగల్యం
కస్సు బుస్సుల కామాటంలో కౌగిలి గింతే కళ్యాణం
(గోడను జరిపే ముచ్చట గనరే వనితలారా మీరు)
(ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జగతిలో)
(గోడను జరిపే ముచ్చట గనరే వనితలారా నేడు)



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link