Andaralaga

అందర్లాగా నేను అంతే అనుకోవాలా
తొందర పెట్టే తోవల వెంటే వెళిపోవాలా
అందర్లాగా నేను అంతే అనుకోవాలా
తొందర పెట్టే తోవల వెంటే వెళిపోవాలా
అనుకోనిదైనా ఆలోచన
బాగుంది అననా ఈ భావన
నిన్నాడగాలనుకుంటున్నా
నిందించాలా ఆనందించాలా

No no అటు పోవద్దు మనసా ఏంటా మత్తు
అన్నా ముందే ఎన్నో చెప్పి
ఏదో సరదాలెద్దు వేరే ఏమి లేదు
తప్పా అంది కట్టు తప్పి
వీలైతే కాసిని కబుర్లు కుదిరితే cup coffee
అంటూనే చేజారింది ఇట్టే కన్ను కప్పి
మాట మాట కలిపి అటు పైన మాయగొలిపి
ఎంత హాయి అందే ఈ తీయనైన నొప్పి
నిన్నాడగాలనుకుంటున్నా
నిందించాలా ఆనందించాలా
అందర్లాగా నేను అంతే అనుకోవాలా
తొందర పెట్టే తోవల వెంటే వెళిపోవాలా

తానే నమ్మేతట్టు తనపై తానే ఒట్టు
వేస్తూ అందించింది హామి
పోన్లే పాపం అంటూ త్వరగా వచ్చేయ్ ఆంటూ
చూస్తూ పంపించాను మదిని
గూడంతా ఖాళీ చేస్తూ వెళిపోయిన గువ్వల్లా
నా కన్నుల్లో కలలన్నీ నీ వళ్ళో చిక్కాలా
ఎవరి నేరమంటూ నిష్టూరమెందుకంటే
కలిసి ఒప్పుకుంటే అది కూడా మంచిమాటే
నిన్నాడగాలనుకుంటున్నా
నిందించాలా ఆనందించాల
అందర్లాగా నేను అంతే అనుకోవాలా
తొందర పెట్టే తోవల వెంటే వెళిపోవాలా
అనుకోనిదైనా ఆలోచన
బాగుంది అననా ఈ భావన
నిన్నాడగాలనుకుంటున్నా
నిందించాలా ఆనందించాలా



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Yogeshwara Sharma
Lyrics powered by www.musixmatch.com

Link