Jummandi Nadam - Siri Siri Muvva / Soundtrack Version

ఝుమ్మంది నాదం
సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా

ఝుమ్మంది నాదం
సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా

ఎదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
ఎదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా

ఝుమ్మంది నాదం
సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం

ఝుమ్మంది నాదం
సయ్యంది పాదం

మెరుపుంది నాలో
అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో
అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం
సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా



Credits
Writer(s): Veturi Murthy, K Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link