Jam Aisa Nashila (From "Darodekhor")

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే

ఏ దరి వెతికెదనే నెచ్చెలీ
నిన్నెట కాంచెదనే
నిత్య నిశీధి ఇది
చీకటి సూన్యమే మిగిలినదే

చిత్ర నయనమది
చక్కని చక్కెర పలుకులేవీ
సుందరహాసమేది
కావేరి నురగల పరుగులేవీ

#PRE-CHORUS
మంచుమబ్బులవలే ప్రేమగా
తడిమిన చేతులెవీ
గోరు వెచ్చ కాంతుల వేకువై
వెలిగిన చూపులేవీ

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

ఆరని జ్వలనమయే
హృదయం తీరని నరకమయే
ప్రాణం శిధిలమయే సమయం
చలనము లేనిదయే

నిప్పుల ఉప్పెనలో
నన్నిలా ముంచితివెందులకే
నేరము చెయ్యక
ఏ శిక్షలో వగచితి నీ కొరకే

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే



Credits
Writer(s): Prabhakar Jog, Shantaram Nadgaonkar
Lyrics powered by www.musixmatch.com

Link