Ninne Ninne

నిన్నే నిన్నే అల్లుకుని
కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని
కొలువుంచే మంత్రం నీవవనీ
ప్రతి పూట పువ్వై పుడతా
నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనవుతా
నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేడనవనీ

నిన్నే నిన్నే అల్లుకుని
కుసుమించే గంధం నేనవని

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వెలవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఎలవలసిన దొరవు నువ్వే
రమణి చరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేదించే శ్యామసుందర
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగా పండించరా

నిన్నే నిన్నే అల్లుకుని
కుసుమించే గంధం నేనవని

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమ
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమ
గంగ పొంగునాపగలిగిన కైలాసమా
కొంగు ముళ్లలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంతా కరిగించి ధారపోయనా
ఆయువంతా వెలిగించి, హారతీయనా

నిన్నే నిన్నే నిన్నే
ఓ, నిన్నే నిన్నే నిన్నే



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link