Vaalu Kanuladaanaa

వాలుకనులదానా
వాలుకనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలను ఐతినే ఓ
నోట మాటరాక మూగబోతినే
నోట మాటరాక మూగబోతినే

వాలుకనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలను ఐతినే ఓ మాటరాక
నోట మాటరాక మూగబోతినే
నోట మాటరాక మూగబోతినే

చెలియా నిన్నే తలచి కనులజడిలో తడిసి
రేయి నాకు కనులకునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటియేది ప్రియతమా
నీ కీర్తే లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలకా చిలకా
నీ కీర్తే లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా

వాలుకనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలను ఐతినే ఓ
నోట మాటరాక
నోట మాటరాక మూగబోతినే

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా నీ సొగసుకేది సాటి
వాలుకనులదానా
వాలుకనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలను ఐతినే ఓ మాటరాక
నోట మాటరాక మూగబోతినే
నోట మాటరాక మూగబోతినే
నోట మాటరాక మూగబోతినే



Credits
Writer(s): Siva Ganesh, A R Rahman, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com

Link