Ennenni Kalalu Kannayi

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కలలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం
ఇదేం శాపం
నీ ఆశలను
గాలి పాలు చేసే నలు దిశలు

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కలలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం
ఇదేం శాపం

మూడుముళ్ళనే మురిపాలు
మూడునాలకే మట్టిపాలు
ఏడు అడుగుల పయణాలు
నీకు చూపినవి నరకాలు
ఏమి నేరమని ఈమె నోములను కాల రాసినవి కష్టాలు
ఓ, బ్రహ్మయ్యా
ఆడ జన్మ పొంది చూడయ్య

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కలలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం
ఇదేం శాపం

ఆదరించు మనసేదైన
ఆత్మబంధువే అవుతుంది
రక్తబంధమే లేకున్నా
మానవత్వమే చాలంది
మనిషిలోని ఆ మంచితనమే ఈ నేల తల్లిని నిలిపింది
ఓ, చిట్టి తల్లీ
నేడు నీకు ఇదే పునఃజన్మ

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కలలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం
ఇదేం శాపం
నీ ఆశలను
గాలి పాలు చేసే నలు దిశలు



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link