Sri Ranga Ganga

ఆ ఆ ఆ ఆ
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు
కృష్ణవేణిలో అలలగీతాలు
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే

కృష్ణాతీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శృతిలో
అలలై పొంగేను జీవనగీతం కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకీలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లె పదమల్లె పల్లవే పాడగా
శ్రీ త్యాగరాజ కీర్తనై సాగె తీయనీ జీవితం
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే

గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగును ప్రవహించు తెలుగింటి రాణీ
పాపాల హరియించు పావన జలమూ
పచ్చగ ఈనేల పండించు ఫలమూ
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరిలెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లకపటమే కానరానీ ఈ పల్లెసీమలో
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే



Credits
Writer(s): Vennelakanti, Vidyasagar
Lyrics powered by www.musixmatch.com

Link