Diwali Holi

దివాళి హొలీ కలిసి మెరిసే
ఖుషీ మాది ఓ
పువ్వుల దారి రమ్మని పిలిచే
తొలి ఉగాది ఓ
ఏదో వైపుగా సాగే జీవితం
మళ్ళీ హాయిగా నవ్విందీ క్షణం
దూరం కాని ఆనాటి స్నేహం కదా
చేయందించి మాతోడు నడిచిందిలా
గుండెలలో ఈ సరదా
పండుగలా ఉంది కదా

దివాళి హొలీ కలిసి మెరిసే
ఖుషీ మాది ఓ
పువ్వుల దారి రమ్మని పిలిచే
తొలి ఉగాది ఓ
తీరని కలత్తెన చిరుచేదు
తియ్యని స్వరమైనదీనాడు
వేసవి వడగాలి దరిరాదు
వెన్నెల కలిసింది మాతోడు
ఇప్పుడు మొదలైన సంతోషాలు
ఇక పైన ఉంటే చాలు
నిన్నలు కలగన్న ఆనందాలు
రేపటిలో మానేస్తాలు

దివాళి హొలీ కలిసి మెరిసే
ఖుషీ మాది ఓ
ఎందరు ఉన్నా ఎవరు లేని
ఒంటరి తనమింక కనరాని
కోరిన తీరం ఎదురు పడని
అడుగు తడబాటు ఇక లేదే
కొమ్మకు చిగురైన కొత్త ఉగాది
సందడిగా రాబోతుంటే
రెప్పలు బరువైన నిమిషాలన్నీ
వేడుకగా మారాలంతే

దివాళి హొలీ కలిసి మెరిసే
ఖుషీ మాది ఓ
పువ్వుల దారి రమ్మని పిలిచే
తొలి ఉగాది ఓ



Credits
Writer(s): Mani Sarma, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link