Nee Tholisariga - From "Santhosham"

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదిలిన కధ వెతికే మనసుకు మమతే పంచుమా
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగా కనబడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా

సాహిత్యం: సిరివెన్నెల

Credits
Writer(s): Rabindra Prasad Pattnaik, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link