Vasantham La

వసంతంలా వచ్చిపోవా ఇలా
నిరీక్షించే కంటికే పాపలా
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన
తొలకరి పాటల సొగసరి కోయిలలా

వసంతంలా వచ్చిపోవా ఇలా
నిరీక్షించే కంటికే పాపలా

హాయిలా మురళి కోయిల అరకులోయలా పలుకగా
వేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలిపాలే
మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా
నడిచే బృందావని నీవని తెలిసే కలిశా
పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా

వసంతంలా వచ్చిపోవా ఇలా
నిరీక్షించే కంటికే పాపలా

మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకో
నీవులో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే
శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే
కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే
నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా

వసంతంలా వచ్చిపోవా ఇలా
నిరీక్షించే కంటికే పాపలా
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన
తొలకరి పాటల సొగసరి కోయిలలా
వసంతంలా వచ్చిపోవా ఇలా



Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link