Gundello Emundho

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీపేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీపేరే పిలుస్తోంది
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీపేరే పిలుస్తోంది

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీపేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link