Neneppudaina (From "Ramayya Vasthavayya")

నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో (ప్రేమలో)
గోరంత గుండెలో ఇన్నాళ్లు
రవ్వంత సవ్వడే రాలేదు
మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో

(కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మదువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే)

నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో (ప్రేమలో)

కన్నె కస్తూరినంత నేనై
వన్నె ముస్తాబు చేసుకోన
చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా
ఇంటికింపైన రూపు నీవె
కంటి రెప్పైన వేయ నీవె
నిండు కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో
నిన్ను నూరేళ్ళు బంధించనా

(కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మదువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే)

నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో

మల్లె పూదారులన్ని నీవై
మంచూ పన్నీరులన్ని నేనై
వసంతాల వలసే పోదాం సుఖాంతలకే
జంట సందేళ్ళలన్ని నేనై
కొంటె సయ్యాటలన్ని నీవై
నువ్వు నాలోకమై నేను నీమైకమై
ఏకమౌదాము ఏనాడిలా

కనులూ కనులూ కలిసే
(కనులూ కనులూ కలిసే)
కలలే అలలై ఎగిసే
(కలలే అలలై ఎగిసే)
మనసూ మనసూ మురిసే
(మనసూ మనసూ మురిసే)
మదువై పెదవే తడిసే
(మదువై పెదవే తడిసే)
తెరలే తొలిగే సొగసే
(తెరలే తొలిగే సొగసే)
కురులే విరులై విరిసే
(కురులే విరులై విరిసే)

నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో
(ప్రేమలో, ప్రేమలో)



Credits
Writer(s): Sahithi, S Thaman
Lyrics powered by www.musixmatch.com

Link