Odupunna Pilapu - Siri Siri Muvva / Soundtrack Version

ఒడుపున్న పిలుపు
ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది

అది మన ఊరి కోకిలమ్మ
నిన్నడిగింది కుశలమమ్మా
అది మన ఊరి కోకిలమ్మ
నిన్నడిగింది కుశలమమ్మా
నిజమేమో తెలుపు
నీ మనసు తెలుపు
ఎగిరెను మన ఊరి వైపు
అది పదిమంది కామాట తెలుపు
నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరెను మన ఊరి వైపు
అది పదిమంది కామాట తెలుపు

గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే

యదలో ఏదో మాట రొధలో ఏదో పాట
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే

అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెళ్ళు పువ్వా బిటులికిపడుతుంటే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెళ్ళు పువ్వా బిటులికిపడుతుంటే
ఎటిమార లంకలోన ఏటవాలు డొంకలోన
ఎటిమార లంకలోన ఏటవాలు డొంకలోన
వల్లంగి పిట్ట పల్లకిలోన చల్లంగ మెల్లంగ ఊగుతుంటే

గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే



Credits
Writer(s): Mahadevan K V, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link