Andam Sharanam

అందం శరణం గచ్చామి
అధరం శరణం గచ్చామి

ఈ సాయంత్ర వేళ
నీ ఏకాంత సేవ
అతి మధురం అనురాగం
ఒదిగే వయ్యారం
ప్రణయం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సింధూర వేళ
నీ శృంగార లీల
సుఖ శిఖరం శుభయోగం
అది నా సంగీతం

ఎంతకూ తీరని ఎదలో ఆశలేమో
అడగరానిదై చెప్పరానిదై
పెదవుల అంటింతనై
మాటతో తీరని మదిలో దాహమే
చిలిపి ముద్దుకై చినుకు తేనెకై
కసి కసి కవ్వింతలై
నీ నవ్వు నాలో నాట్యాలు చేసే
కౌగిట్లో సోకమ్మ వాకిట్లో
తెరిచే గుప్పిల్లలోన

ప్రణయం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి

చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా
వలపు గాలికే వాడుతున్నది
విసరకు పూబాణమే
చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా
చలికి రేగినా ఒడికి చేరినా
చెరి సగమీ ప్రాణమే
నీ ఊపిరే నాలో పూలారబోసే
అందాలో నా ప్రేమ గంధాలో
ముసిరే ముంగిళ్లలోన

అందం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సాయంత్రం వేళ
నీ ఏకాంత సేవ
సుఖ శిఖరం శుభయోగం
అది నా సంగీతం



Credits
Writer(s): Veturi, Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link