Amma Kutti Amma Kutti

అమ్మ కుట్టి అమ్మ కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్మ కుట్టి అమ్మ కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

ఓ అసలే విరహం
అయ్యో దూరం ఎల్లాగున్నావు
హా చారెడు పిడికెడు బారెడు పిల్లా
ఎల్లాగున్నావు ఎందా
చెంపకు కన్నులు చారెడు
సన్నని నడుము పిడికెడు
దువ్వి దువ్వక పువ్వులు ముడిచిన
నల్లని నీ జడ బారెడు మనసిలాయో
అమ్మ కుట్టి అమ్మ కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి
అదేవిటి
ఓ గుటకల చిటికెలు కిటుకులు
అబ్బో చాలా గడుసు
మ్మ్ గుటకలు చిటికెలు కిటుకులు
ఏమిటి సంగతి
ఆ కులుకు చూస్తే గుటకలు
సరసకు రమ్మని చిటికెలు
చక్కని చిన్నది అందం చందం
చేజిక్కాలని కిటుకులు మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి మనసిలాయో
మనసిలాయో మనసిలాయో అమ్మ కుట్టి

గుండెల్లోన గుబ గుబలాడే
ఊహల ఊరెను ఉవ్విళ్ళు
పరవశమైన మా శ్రీవారికి
పగ్గాల్లేని పరవళ్ళు
చుట్టూ చూస్తే అందాలు
లొట్టలు వేస్తూ మా వారు
చుట్టూ చూస్తే అందాలు
లొట్టలు వేస్తూ మా వారు
అక్కడ తమకు ఇక్కడ మనకు
విరహంలోన వెక్కిళ్ళు
మనసిలాయో హొ హొ

అమ్మ కుట్టి అమ్మ కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్మ కుట్టి అమ్మ కుట్టి అమ్మ కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్



Credits
Writer(s): K V Mahadevan, Arudra
Lyrics powered by www.musixmatch.com

Link