cheppamma

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
ఓ మోమాటం

నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
ఓ మోమాటం

వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురుపడతావేంటి ఎటు చూసినా
చంప గిల్లిపోతావేంటి గాలివేలితోన
అంత గొడవపెడతావేంటి నిద్దరోతూ ఉన్నా
అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా
ఒంటిగా ఉండనీవేంటి ఒక్క నిమిషమైనా
ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను
నువ్వేంచేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
ఓ మోమాటం

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా
ఏడిపించబుద్ధౌతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఓడిపోతూ ఉన్నా
లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా అయ్యోరామా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
ఓ మోమాటం

నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా I love you చెప్పేసెయ్ అంటోంది
ఓ ఆరాటం
I love you I love you I love you I love you I love you I love you

Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link