Dum dum dum

డుం డుం డుం నటరాజు ఆడాలి
పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి
నేల జాబిల్లిగా
గుండెల్లో గురి ఉంటే ఎదగాలి
తారలే కళ్లుగా
నీ మాటే నీ బాటై సాగాలి
సూటి సూరీడుగా
బ మాట నుంచి భా మాటదాక
నాదేనురా పైఆట
ఆడితప్పనేమాట అయ్యా చూపిన బాట
నమ్మినోళ్లకిస్తా నా ప్రాణం

డుం డుం డుం నటరాజు ఆడాలి
పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి
నేల జాబిల్లిగా హా
హే అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా
తొడగొట్టి చూపించరా
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా
తొడగొట్టి చూపించరా
బ్రహ్మన్న పుత్రా హే బాలచంద్ర
చెయ్యెత్తి జే కొట్టరా
పొగరున్న కొండ వెలుగున్న మంట
తెలుగోడివనిపించరా
వేసంగి లోన పూసేటి మల్లి
నీ మనసు కావాలిరా
అరె వెలిగించరా లోని దీపం
అహ తొలగించరా బుద్ధి లోపం
ఓహో ఆత్మేరా నీ జన్మ తార
సాటి మనిషేరా నీ పరమాత్మ

డుం డుం డుం నటరాజు ఆడాలి
పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి
నేల జాబిల్లిగా
చూపుంటే కంట్లో ఊపుంటే ఒంట్లో
నీకేంటి ఎదురంటా

(జుమ్కు చికుం జుమ్కు చికుం)
(జుమ్కు చికుం జుం)

చూపుంటే కంట్లో ఊపుంటే ఒంట్లో
నీకేంటి ఎదురంటా
నీవు నీకు తెలిసేలా నిన్ను నీవు
గెలిచేలా మార్చాలిరా మన గీత
చిగురంత వలపో చిలకమ్మా పిలుపో
బులపాఠం ఉండాలిరా
పెదవుల్లో చలి ఇలా పెనవేస్తే
చలి గోల చెలగాటం ఆడాలిరా
అహ మారిందిరా పాత కాలం
నిండు మనసొక్కటే నీకు మార్గం

డుం డుం డుం నటరాజు ఆడాలి
పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి
నేల జాబిల్లిగా
బ మాట నుంచి భా మాటదాక
నాదేనురా పైఆట
ఆడి తప్పనేమాట అయ్యా చూపిన బాట
నమ్మినోళ్లకిస్తా నా ప్రాణం
డుం డుం డుం నటరాజు ఆడాలి
పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి
నేల జాబిల్లిగా
డుం డుం డుం నటరాజు ఆడాలి
పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి
నేల జాబిల్లిగా



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link