Bandira Pogabandira

జింజిన్న జింజిన్న జిన్నా జిన్నా
జింజిన్న జింజిన్న జిన్నా జిన్నా
రంగూ రంగుల రైలుబండి
పరుగూలెత్తి సాగితే
పచ్చ రంగులో పోవాల
సంజ రంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో
రాగాలెన్నో తియ్యాలా
తన తీరం చేరి తీరాలా

(బండిరా పొగబండిరా)
(దొరలెక్కే రైలుబండిరా)
(దొరసానులెక్కే బండిరా)
అనుకోకే నాలోన విలువిచ్చాను
నిను కోరి ఓ క్లాసు దిగి వచ్చాను
అందుకునే ఒక రోజు ఉండి ఉంటది
అందుకనే మన మోజు పండి ఉంటది
బహురూపధారికి బహుమానమియ్యనా
సాధించే రాజు వేళ సంధ్యారాగాల మాల

(బండిరా పొగబండిరా)
(దొరలెక్కే రైలుబండిరా)
(దొరసానులెక్కే బండిరా)

రంగూ రంగుల రైలుబండి
పరుగూలెత్తి సాగితే
పచ్చ రంగులో పోవాల
సంజ రంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో
రాగాలెన్నో తియ్యాలా
తన తీరం చేరి తీరాలా

(బండిరా పొగబండిరా)
(దొరలెక్కే రైలుబండిరా)
(దొరసానులెక్కే బండిరా)
సుందరమా సుమధురమా మందగమనమా
మంజులమై సంచరించు మలయ పవనమా
చీకటిలో నీలి రంగు అద్దుకుంటూనే
వేకువలో ప్రేమ రంగు దిద్దుకుందామా
ఊహాగానాలతో లాలించే రాజుకి
సేవిస్తూ వెయ్యాలిక జాజి జాపత్రిమాల

(బండిరా పొగబండిరా)
(దొరలెక్కే రైలుబండిరా)
(దొరసానులెక్కే బండిరా)

రంగూ రంగుల రైలుబండి
పరుగూలెత్తి సాగితే
పచ్చ రంగులో పోవాల
సంజ రంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో
రాగాలెన్నో తియ్యాలా
తన తీరం చేరి తీరాలా

(బండిరా పొగబండిరా)
(దొరలెక్కే రైలుబండిరా)
(దొరసానులెక్కే బండిరా)

రంగూ రంగుల రైలుబండి
పరుగూలెత్తి సాగితే
పచ్చ రంగులో పోవాల
సంజ రంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో
రాగాలెన్నో తియ్యాలా
తన తీరం చేరి తీరాలా

(బండిరా పొగబండిరా)
(దొరలెక్కే రైలుబండిరా)
(దొరసానులెక్కే బండిరా)

(బండిరా పొగబండిరా)
(దొరలెక్కే రైలుబండిరా)
(దొరసానులెక్కే బండిరా)



Credits
Writer(s): Balabomma Rajendraprasad
Lyrics powered by www.musixmatch.com

Link