Kallakunna

కళ్ళకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో
నా బంగారుకొండ
అంతదూరం ఉంటే ఎట్టయ్యో
చెవులకున్న దుద్దులు చూసా
ముక్కుకున్న ముక్కెర చూసా
చూడమన్నవన్నీ చూసానే
నా పువ్వుల దండా
చూపకుండ ఎన్నో దాచావే
జారుతున్న కొంగుని చూడు
ఆపుతున్న సిగ్గుని చూడు
గుండెలోని తొందరచూడు
చూడు చూడు చూడయ్యో

కళ్ళకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో
నా బంగారుకొండ
అంతదూరం ఉంటే ఎట్టయ్యో
చూడయ్యో... ఏమయ్యో
నా ఒంటి మెరుపు బుగ్గల్లో నునుపు
తెల్లార్లూ చూడయ్యో
నీ చూపే తగిలాక పరువం ఆగదే
నీ కోలకళ్ళు ఆ చీర గళ్ళు
ఈరోజే చూసానే
సుకుమారం చూస్తుంటే నిదురే రాదులే
ఒంపు సొంపు చూడాలి
ఉయ్యాలల్లే ఊగాలి
నీ కన్నుల్లో నా రూపం
నూరేళ్ళైనా ఉండాలి
ఓ అత్త కొడకా కన్నెత్తి త్వరగా
అందాలు చూసెయ్యరా ముందుగా

కళ్ళకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో
నా బంగారుకొండ
అంతదూరం ఉంటే ఎట్టయ్యో
(మాంగల్యం తంతునానేనా)
(మమజీవన హేతునా)
(కంఠే భద్నామి సుభగే)
(త్వం జీవ శరదాం శతం)
(శతం శతం శతం)
నా సోకు చెఱుకు కాసింత కొరుకు
తప్పేమి కాదయ్యో
సరసాల ఫలహారం ఇదిగో చూసుకో
నాజూకు సరుకు నచ్చేంతవరకు
గిచ్చేసి పోతాలే
శింగారం చూస్తుంటే తనివే తీరదే
మళ్ళీ మళ్ళీ చూడాలి
తుళ్ళీ తుళ్ళీ పోవాలి
నీ కౌగిట్లో కలకాలం
నేనే ఉండి పోవాలి
ఓ పెళ్ళికొడకా మోమాటపడక
దాచింది చూసెయ్యరా ముందుగా

చెవులకున్న దుద్దులు చూసా
ముక్కుకున్న ముక్కెర చూసా
చూడమన్నవన్నీ చూసానే
నా పువ్వుల దండా
చూపకుండ ఎన్నో దాచావే
జారుతున్న కొంగుని చూడు
ఆపుతున్న సిగ్గుని చూడు
గుండెలోని తొందరచూడు
చూడు చూడు చూడయ్యో



Credits
Writer(s): M M Sri Lekha, Bhaskarabatla
Lyrics powered by www.musixmatch.com

Link