Velugu Cheekati

వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న
వదిలేసావ నన్నే యెడబాటున
కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని
పసివాణ్ణేలే ఇంకా ఎద మాటున
మదిలో ఎంతో దిగులే ఉన్నా
నవ్వుతూ నన్నేపెంచావు నాన్న
కరిగే మైనం నువవుతున్నా
నిషిలో వెలుగై నడిపావు నాన్న

వెలుగు చీకటి లోన తోడై నిలిచే నాన్న
వదిలేసావ నన్నే యెడబాటున
కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని
పసివావాణ్ణేలే ఇంకా ఎద మాటున

నూవు కరుణిస్తే కనుతెరిచా
నూవు నడిపిస్తే నే నడిచా
నూవు చూపిస్తే జగమెరిగాను
నూవు కథ చెబితే మైమరిచా
నీ ఎద పైనే నిదురించానే
నీకొడుకై తరియించాను
నువ్వే లేని నేనే లేను
నువ్వు నేను వేరే కాము
నాలో నేను నువ్వే నాన్న

మదిలో ఎంతో దిగులే ఉన్న
నవ్వుతు నన్నే పెంచావు నాన్న
కరిగే మైనం నువవుతున్నా
నిషిలో వెలుగై నడిపావు నాన్న



Credits
Writer(s): Bulganin, Chaitanya Varma
Lyrics powered by www.musixmatch.com

Link