Entha Chitram Kada

ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఓడిపోయా
తప్పో ఒప్పో ఆలోచించే వీలే లేదాయే
తప్పనిసరిగా తెప్పను ముంచే ప్రేమే వరదాయే
ఈ ముప్పును తప్పుకుపోయే వేరేదారే కనపడదాయే

ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఓడిపోయా

కంటివైపు రానంది కునుకు
కత్తిమీద సామయింది బతుకు
గుండెల్లోన పుట్టింది ఒణుకు
గొంతుదాటి రానంది పలుకు

ఓరి దేవుడో ఇంత కోపమా నాపైన నీకు
చెప్పాలంటే అంత సులభమా శక్తినివ్వు నాకు
ఇక ఒక్కపూటైనా నేనోర్చుకోగలనా
ఏదేమైనా ఏదో ఒకటి చెప్పేస్తా తనకు

ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఒదిగిపోయా

నన్నే గుచ్చిపోయింది సొగసు
ఒళ్ళే మరచిపోయింది మనసు
ఉన్నట్టుండి లేచింది వయసు
ప్రేమో పిచ్చో నాకేమి తెలుసు

ఎంత ఆపినా ఆగనన్నది దూకే అడుగు
ఎంత దూరమో తెలియకున్నది తుళ్ళే పరుగు
తన తీరమేదైనా ఏ దారిలోనైనా
చేరేవరకు అలుపేలేదు పట్టేస్తా తుదకు

ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఒదిగిపోయా
తప్పో ఒప్పో ఆలోచించే వీలే లేదాయే
తప్పనిసరిగా తెప్పను ముంచే ప్రేమే వరదాయే
ఈ ముప్పును తప్పుకుపోయే వేరేదారే కనపడదాయే

ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఒదిగిపోయా



Credits
Writer(s): Sai Karthik, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link