Bavunnara Bagunnara

బావున్నారా బాగున్నారా భామ గారు బాగున్నారా
ఆ బావున్నారా బాగున్నారా భామ గారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా
మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని
ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో
అమ్మో అమ్మమ్మమ్మో
ఆ బావున్నారా బాగున్నారా భామ గారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా

చిన్ని ముద్దు ఇమ్మంటారా
ఛి పో వద్దు పొమ్మంటారా
చుమ్మా అంటు చెంతకొస్తే
కొమ్మమీద కూర్చుంటారా
మాట మాట పెంచేశారా
మంచి చెడ్డా మానేశారా
గోటితోటి పోయేదాన్ని గూటిదాకా లాగేశారా
వరసలు కలిపి మరదలు
ఒడికే వేంచేస్తారా మనసారా
బూరెల్లాంటి బుగ్గలు రెండు
బొంచేస్తాలే కడుపార
ఆపై రతి మహరాజల్లే మత్తుల్లో ముంచేస్తారా
అమ్మో అమ్మమ్మమ్మో
అమ్మో చిన్నమ్మమ్మో
బావున్నారా బాగున్నారా భామ గారు బాగున్నారా
బాగున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా

పిల్లా అంటూ లాలిస్తారా
పెళ్ళాం post ఇప్పిస్తారా
లిల్లిపూల మంచం మీద
Pillow నాకు పంచిస్తారా
వేళా పాలా లేదంటారా
వేలాకోళం కాదంటారా
చాటుమాటు పాఠాలన్ని నోటితోటి చెప్పిస్తారా
ఆలుమగలం అయిపోతాంలే అడిగిందిచ్చే సుకుమారా
నోరే జారితే పరవాలేదు
కాలే జారకు యువతారా
జరిగే కళ్యాణం దాకా
జాగారం చెయ్ మంటారా
అమ్మో అమ్మమ్మమ్మో
అమ్మో చిన్నమ్మమ్మో
బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార బావగారు బాగున్నారా

ఎదురు చూపులు చూస్తున్నారా
మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని
ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో
అమ్మో అమ్మమ్మమ్మో



Credits
Writer(s): Chandrabose, Deva
Lyrics powered by www.musixmatch.com

Link