Andhala Seemalo

అందాల సీమలోని పారిజాత పుష్పమా
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా
వరించి నన్ను చేరుమా
సుఖాన ముంచి తేల్చుమా
ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ
శృంగార వీణ మీటి
గోల చేస్తే న్యాయమా

అందాల సీమలోని పారిజాత పుష్పమా
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా
రా రమ్మంది లేత చెక్కిలి
రేపెట్టింది కొత్త ఆకలి
సిగ్గు మొగ్గ మేలుకుంది తీయగా
తేనె ముద్దలారగించు హాయిగా
అంత భాగ్యమా పంచ ప్రాణమా
ఒడిలో చేరనీయుమా... హో

అందాల సీమలోని పారిజాత పుష్పమా
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా
లాగించేస్తే ప్రేమ జిలేబి
ఏమౌతుందో కన్నె గులాబి
పాల పొంగులాంటిదమ్మ కోరిక
పైటచాటు దాచుకోకే ప్రేమికా
కొంగుజారితే కొంపమునగదా
What-eh risk మన్మథా

అందాల సీమలోని పారిజాత పుష్పమా
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా
వరించి నన్ను చేరుమా
సుఖాన ముంచి తేల్చుమా
ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ
శృంగార వీణ మీటి
గోల చేస్తే న్యాయమా



Credits
Writer(s): Koti, Siri Vennela Seetha Ramasasthry
Lyrics powered by www.musixmatch.com

Link