Manasuna

(తళక్ తళక్ అని తళకుల తార)
(మిణక్ మిణక్ అని మిల మిల తార)
(ఛమక్ ఛమక్ అని చిలిపి సితార ఓ)
(తళక్ తళక్ అని తళకుల తార)
(మిణక్ మిణక్ అని మిల మిల తార)
(ఛమక్ ఛమక్ అని చిలిపి సితార ఓ)
మనసున్న కనులుంటే
ప్రతిచోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే
బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా

(తళక్ తళక్ అని తళకుల తార)
(మిణక్ మిణక్ అని మిల మిల తార)
(ఛమక్ ఛమక్ అని చిలిపి సితార ఓ)
(తళక్ తళక్ అని తళకుల తార)
(మిణక్ మిణక్ అని మిల మిల తార)
(ఛమక్ ఛమక్ అని చిలిపి సితార ఓ)

మనసున్న కనులుంటే
ప్రతిచోట మధుమాసం కనిపించదా
అలలై ఎగసిన ఆశ
నాట్యం చేసే వేళా
ఆలుపే ఎరుగని శ్వాస
రాగం తీసే వేళా
దిశలన్నీ తలవొంచి తొలగే క్షణం
ఆకాశం పలికింది అభినందనం
అదిగదిగో మనకోసం తారాగణం
తళుకులతో అందించే నీరాజనం
మనదారికెదురున్నదా

మనసున్న కనులుంటే
ప్రతిచోట మధుమాసం కనిపించదా
నవ్వే పెదవులపైన
ప్రతి మాట ఒక పాటే
ఆడే అడుగులలోన
ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందం కొలువున్నదా
ఎండైనా వెన్నెల్లా మురిపించదా
కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా
కష్టాలు కన్నీళ్లు మరిపించదా
జీవించడం నేర్పదా

మనసున్న కనులుంటే
ప్రతిచోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే
బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా
లాలాల లలలాల లలలాల
లలలాల లాలాల
లాలాల లలలాల లలలాల
లలలాల లాలాల



Credits
Writer(s): S R Koteswara Rao, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link