Pavuraniki Panjaraniki (From "Chanti")

పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం

కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ ఓ ఓ ఓ

తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి చాకింది నా కన్న తల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపీ పెంచింది నా లోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా...
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ ఓ ఓ ఓ
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం

తాళంటే తాడనే తలిచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం నా మీద నాకేలే కోపం
నాతోనే వేదములా ఇది తీరని వేదనలా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాదే పోదా
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ ఓ ఓ ఓ
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే ముడ లోకం

Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link