Ye Navade Teramo (From "Sankeerthana")

ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మవరమో

ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మవరమో
కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో

ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మవరమో

నాలోని నీవే నేనైనాను, నీలోని నేనే నీవైనావు
నాలోని నీవే నేనైనాను, నీలోని నేనే నీవైనావు
విన్నావా ఈ వింతను, అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను, అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను

ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మవరమో

ఆకాశమల్లే నీవున్నావు, నీ నీలిరంగై నేనున్నాను
ఆకాశమల్లే నీవున్నావు, నీ నీలిరంగై నేనున్నాను
కలిసేది ఊహేనను ఊహల్లో కలిశామను
కలిసేది ఊహేనను ఊహల్లో కలిశామను
నీవు నేనే సాక్ష్యాలను

ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మవరమో
కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో

ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మవరమో



Credits
Writer(s): Ilayaraja, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link