Nuvvemi Chesavu (From "Pelli Chesukundham")

నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడటింది పాపం
చినబోకుమా

నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం
ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం

నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడటింది పాపం
చినబోకుమా

జరిగింది ఓ ప్రమాదం
ఏముంది నీ ప్రమేయం
దేహనికైన గాయం ఏ మందుతోనొ మాయం

విలువైన నిండు ప్రాణం
మిగిలుండటం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
ఇల్లాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా?
భర్తన్నవాడెవడూ పురుషుడే కాదు అనా
శీలం అంటే గుణం అని అర్ధం

నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడటింది పాపం
చినబోకుమా

గురువింద ఈ సమాజం
పరనింద దాని నైజం
తనకింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం

తన కళ్ళముందు ఘోరం
కాదనదు పిరికి లోకం
అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
పడతి పరువు కాచే చేవ లేని సంఘం
సిగ్గుపడక పోగా నవ్వుతోంది చిత్రం
అనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతే గాని నీలో లేదే దోషం

నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం
ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం



Credits
Writer(s): S R Koteswara Rao, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link