Chitapata Chinukulu

చిటపట చినుకులు తనువును తడిపే వానలో
తడిసి తడిసి తపనలు రేగిన వేళలో
హత్తుకుపోతేనే సుఖం
హద్దులు చెరిపేయ్ ఈ క్షణం ... రా మరి
చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
చలి చలి గాలుల లోగిలి
ఇచ్చేయ్ కమ్మని కౌగిలి ... రా మరి
చిటపట చినుకులు తనువును తడిపే వానలో
తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే

చినుకల్లె చిటికెలు వేసి పాడాడమ్మో
నా బుగ్గల మీద rowdy బుల్లోడు
మెరుపల్లె ముద్దుల ముద్దర వేసాడమ్మో
ఒళ్ళంతా తడిమి తడిమి సోగ్గాడు
దాని తస్సాదియ్యా జంతర్ మంతర్ గాలి
చమ్మను పడితే మతిపోయిందమ్మో
దాని తస్సారవల జంపర్ bumper సోకు
సూస్తా ఉంటే కసిరేగిందమ్మో
సాకులు ఎందుకు పోకిరి
సర్దుకు పోదాంలే మరి ... రా మరి
చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
తడిసి తడిసి తపనలు రేగిన వేళలో

జంబారే జిత్తులమారి అందుకుపోనా
వలువల్లో గిలగిల్లాడే అందాలు
వగలాడి వన్నెల చిలకా కానుకలీనా
కసి బుసిగా ఊరించేసే గంధాలు
హర్ని తస్సాచక్క బిత్తరు చూపులు దూసి
పక్కకి వస్తే పోనీ అనుకున్నా
ఓర్ని దిమ్మదియ్య ఇట్టా చుట్టుకు పోతే
కిం అనలేక కరిగి పోతున్నా
వేషాలెందుకు చోకిరి
ఇది తొలి వలపుల కిరికిరి ... రా మరి
చిటపట చినుకులు తనువును తడిపే వానలో
తడిసి తడిసి తపనలు రేగిన వేళలో
హత్తుకుపోతేనే సుఖం
హద్దులు చెరిపేయ్ ఈ క్షణం ... రా మరి
చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
చలి చలి గాలుల లోగిలి
ఇచ్చేయ్ కమ్మని కౌగిలి ... రా మరి



Credits
Writer(s): Bappi Lahiri, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link