Mella Mellaga Neethone

మెల్లమెల్లగా నీతోనే కలకాలం గడపాలిలా
మనసారా నిన్ను ప్రేమిస్తున్నా ప్రియతమా ప్రియతమా
చూస్తూ చూస్తూ నీ కన్నుల్లో కరిగిపోతానిలా
మనసారా నీకు మనసిస్తున్నా అందుకో ప్రియతమా

Oh oh you're my Cinderella
Love ఇంత wonderfulaa
నిజం నువ్వు లేకపోతే గుండెలో కిలకిల

ప్రేమలో ప్రతిక్షణం ఉందిలే పరవశం
అందుకే జీవితం నీకిలా అంకితం

మెల్లమెల్లగా నీతోనే కలకాలం గడపాలిలా
మనసారా నిన్ను ప్రేమిస్తున్నా ప్రియతమా ప్రియతమా

నాకెప్పుడెప్పుడూ నీ తలపే, గుండెచప్పుడు నీవరకే
మల్లెతీగలా అల్లుకున్నది నన్ను ఆదమరుపే
మదికోరుకున్నది నీ పిలుపే, అది ఇక్కడిక్కడే వినిపించిందే
రెక్కలొచ్చిన కొత్తఊహలే నన్ను మేలుకొలిపే

అందమైన ప్రేమకథలా
అచ్చమైన తీపికలలా
జ్ఞాపకాల జీవనదిలా సాగుదామిలా

చేరువైతే ఇంత గుబులా
దూరమైతే అంత దిగులా
ప్రేమ అల్లరేంటో చంటిపాపలా

Oh oh you're my Cinderella
Love ఇంత wonderfulaa
నిజం నువ్వు లేకపోతే గుండెలో కిలకిల

ప్రేమలో ప్రతిక్షణం ఉందిలే పరవశం
అందుకే జీవితం నీకిలా అంకితం

నా చూపులెప్పుడూ నీమీదే, కోటి ఆశలు నీమీదే
ఎంతసేపిలా నిన్ను చూసినా చాలు చాలు అనదే
మనసివ్వడానికే ఉంటుందే, అది ఇప్పుడిప్పుడే తెలిసోచ్చిందే
వెళ్లిరమ్మని సాగనంపితే, నిన్ను వదిలిరాదే

పొంగుతున్న ఏటిఅలవై
తాకుతున్న గాలితెరవై
పూటకొక్క పూలరుతువై చేరుకో ఇలా

నీలినింగిలోని మెరుపై
జారుతున్న వానచినుకై
వచ్చి వాలిపోనా చిట్టిగువ్వలా

Oh oh you're my Cinderella
Love ఇంత wonderfulaa
నిజం నువ్వు లేకపోతే గుండెలో కిలకిల

ప్రేమలో ప్రతిక్షణం ఉందిలే పరవశం
అందుకే జీవితం నీకిలా అంకితం

మెల్లమెల్లగా నీతోనే కలకాలం గడపాలిలా
మనసారా నిన్ను ప్రేమిస్తున్నా ప్రియతమా ప్రియతమా



Credits
Writer(s): Bhaskarabatla, Sekhar Chandra
Lyrics powered by www.musixmatch.com

Link