Emaindhi Eevela (From "Aadavari Matalaku Ardhalu Veruley")

Can you feel her
Is your heart speaking to her
Can you feel the love
Yes

ఏమైంది ఈవేళ ఎదలో ఈ సందడేల
మిలమిలమిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేల
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వానలోన ఇంత దాహం

చినుకులలో వానవిల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెలవెలవెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమెవైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాట పాడే
తనువు మరిచి ఆటలాడే
ఏమైంది ఈవేళ ఎదలో ఈ సందడేల
మిలమిలమిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేల

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా

కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటిసారి మెరుపు చూశా
కడలిలాగే ఉరకలేశా



Credits
Writer(s): Yuvan Shankar Raja, Kula Sekhar
Lyrics powered by www.musixmatch.com

Link