Mira Mira Meesam

(రాయుడో
నాయకుడై నడిపించేవాడు
సేవకుడై నడుమొంచేవాడు
అందరి కోసం అడుగేసాడు)
(రాయుడో)
హె మిర మిరా మీసం
(మిర మిరా మీసం, మిర మిరా మీసం)
మెలితిప్పుతాడు జనం కోసం

కర కరా కండల రోషం
(కర కరా కండల రోషం)
పోటెత్తుతాడీ జనం కోసం

మండే ఆవేశం వీడుండే నివాసం
వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువున సెగ రగిలేలా
సూరీడల్లే హే సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు (సూరీడల్లే హే సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు)
పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు
మిర మిరా మీసం (మిర మిరా మీసం)
మెలి తిప్పుతాడు జనం కోసం
(రాయుడో)

ఒకడే వీడు రక రకములవాడు
ఏ రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు
రెప రెపలాడే జండాలా పొగరున్నోడు
తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు
చిగురు వగరు తగిన పొగరు కలగలసిన ఖడ్గం వీడై
హే సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు (హే సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు)
అమ్మతోడు మా చెడ్డ మంచోడీ కాటమ రాయుడు (అమ్మతోడు మా చెడ్డ మంచోడీ కాటమ రాయుడు)

అసలు సిసలు చురుకు సరుకు
అణువణువున సెగ రగిలేలా
సూరీడల్లే హే సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు (సూరీడల్లే హే సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు)
పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు (పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు)

(రాయుడో)



Credits
Writer(s): Anup Rubens, Ramajogaiah Sastry
Lyrics powered by www.musixmatch.com

Link