Emo Emo

ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో
ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో
ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో
నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో
చిరచిరలాడే కంట్లో చెక్కెర దారేంటో
చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో
ప్రతి దానికింక కారణంగ నిన్ను చూపుతుంది ఈ లోకం
నీకయ్యిందేంటో
నే చేసిందేంటో... ఏమో ఏంటో
నే చెప్పిందేంటో
నా తప్పసలేంటో... ఏమో ఏంటో
ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో
ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో

మండేటి సూర్యున్నైనా చల్లార్చే చందమామై నువ్వొవచావా నా కోసం
ఈ అదృష్టం ఏంటో
గర్జించే మేఘాన్నైనా
కరిగించే చల్లగాలై
నువ్వు కలిసావా ఈ నిమిషం
నా అదృష్టం ఏంటో
పేలే శబ్దాలెన్నైన్నా
ఏం చేయలేదే ఇన్నాళ్ళు
ఇవ్వాలే నిశబ్దంలో
హాయిగా వచ్చే వణుకేంటో
నాలో ఉండే పడుచుదనం
నీలో ఉండే పదును గుణం
ఒకటైపోతే మన పయనం
అటుకో ఇటుకో ఎటుకో ఏంటో
ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో
ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో
ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో
నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో

శత్రువుల గుండెల్లోన
నిద్రిస్తూ ఉండే నాకే
నిను చూస్తే నిద్దుర పాడై
ఈ గుండె గుబులేంటో
కతుల్లా కదిలే నువ్వు
మెత్తంగా మునిగావంటే
చంటోడైనా చెబుతాడే
అరె దానర్ధం ఏంటో
అందరిలోనా హుందాగా
నిన్న మొన్న ఉన్నాగా
ఈపై ఎట్టాగుంటానో
ఆపై జరిగే కథలేంటో
అక్కరతోనే గడపకురో
కంచె పట్టు పరికిణితో
నీకై ఒచ్చి నిలిచుంటే
అరెరె అరెరె అలుసా ఏంటో



Credits
Writer(s): M R Hanock Babu, Chegondi Ananthasriram
Lyrics powered by www.musixmatch.com

Link