Neevuleka Veena

నీవు లేక వీణా పలుకలేనన్నదీ
నీవు రాక రాధా నిలువలేనన్నది
నీవు లేక వీణా

జాజి పూలు నీకై రోజు రోజు పూచె
చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయె
చందమామ నీకై తొంగి తొంగి చూసి
చందమామ నీకై తొంగి తొంగి చూసి
సరసను లేవని అలుకలుబోయె
నీవు లేక వీణా

కలలనైన నిన్ను కనుల చూతమన్నా
నిదుర రాని నాకు కలలు కూడ రావె
కదలలేని కాలం విరహ గీతి రీతి
కదలలేని కాలం విరహ గీతి రీతి
పరువము వృధగా బరువుగ సాగె
నీవు లేక వీణా

తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నొ మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలెను స్వామి
తాపమింక నేను ఓపలెను స్వామి
తరుణిని కరుణను యేలగ రావా

నీవు లేక వీణా పలుకలేనన్నది
నీవు రాక రాధా నిలువలేనన్నది
నీవు లేక వీణా



Credits
Writer(s): Athreya, Dasarathi, Arudra, Kosaraju, Sri Sri, S Rajeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link