Subhalekha - From "Kondaveeti Donga"

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో

చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి
మెచ్చీ మెచ్చీ చూడసాగె గుచ్చే కన్నులు
గుచ్చీ గుచ్చీ కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కథంతేలే అదంతేలే
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు
ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలు
అంతేలే కథంతేలే అదంతేలే
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link