Jigelu Rani (From "Rangasthalam")

రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి
మన అందరి కళ్ళల్లో జిగేల్ నింపడానికి జిగేల్ రాణి వచ్చేసింది
ఆడి పాడి అలరించేతది అంతే
మీరందరూ readyగా ఉండండి
అమ్మ జిగేల్ రాణి వచ్చేయమ్మ నువ్వు
ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరేయ్
ఇంత మంది జిగేల్ రాజాలున్నారా మీ ఊళ్ళో
మరి ఉండ్రా ఏంటి
నువ్వత్తున్నావని తెలిసి పక్కూరి నుండి కూడా వచ్చాం ఏగేసుకుంటూ
ఇదిగో ఆ గళ్ల సొక్కా జిగేల్ రాజా ఏంది
గుడ్లప్పగించి జూస్తున్నాడు నా వంకే
నువ్వేదో ఇత్తవని జిగేల్ రాణి
నువ్వేందయ్య పూల సొక్కా
ఓ మీద మీదకి వత్తున్నావు
ఇదిగో ఎవ్వరూ తోసుకోకండి
అందరి దగ్గరికి నేనే వస్తా
అందరడిగింది ఇచ్చే పోతా... అది

ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి
కన్నైన కొట్టవే జిగేలు రాణి
(ఓ ముద్దు పెట్టావే జిగేలు రాణి)
(కన్నైన కొట్టవే జిగేలు రాణి)
ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే
(ముద్దేమో మునసబుకి పెట్టెశానే)
(కన్నేమో కరణానికి కొట్టేశానే)
ఒక్కసారి వాటేస్తావా జిగేలు రాణి
కొత్త president-u కది దాచుంచానే
మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణి
నీ అయ్యతోనే పోటీ నీకు వద్దంటానే
మరి నాకేం ఇత్తావే జిగేలు రాణి
నువ్ కోరింది ఏదైనా ఇచేస్తానే
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితే ఏదైనా కాదంటానా

(జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా)
(ఉన్నదడిగితే నేను లేదంటానా)

నీ వయసు సెప్పవే జిగేలు రాణి
అది ఆరో classలో ఆపేసానే
నువ్వు సదివిందెంతే జిగేలు రాణి
మగాళ్ల ఈక్కినెస్ చదివేసానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి
సుబ్బి సెట్టి పంచె ఊడితే నవ్వేశానే
నన్ను బావా అనవే జిగేలు రాణి
అది police ఒల్లకే reservation-ye
ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణి
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తిని

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితే ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

(అయి బాబోయ్ అదేంటే జిగేల్ రాణి)
(ఏదడిగినా లేదంటావ్)
(నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ)
(నీకేం కావాలో సెప్పూ)

నువ్ పెట్టిన పూలు ఇమ్మంటాము
(పూలతోటి వాటిని పూజిస్తాము)
నువ్ కట్టిన కోక ఇమ్మంటాము
(దాన్ని సుట్టుకు మేము పడుకుంటాము)
నువు ఏసిన గాజులు ఇమ్మంటాము
(వాటి సప్పుడు ఇంటూ సచ్చిపోతము)
అరె నువు పూసిన scent-u ఇమ్మంటాము
(దాని వాసన చూస్తూ బతుకంతా బతికేస్తాము)
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలాంపాటలో పెట్టాను రాజా

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట ఆడు పాడండోయ్ రాజా

నా పాట వేలుకున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కోడెద్దు
నా పాటా పులి గోరు
వెండి పళ్ళెం
ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం
కొత్తగా కట్టించుకున్న ఇల్లు
నా పాట rice mill-u
ఎహే ఇవన్ని కాదు కానీ
నా పాట cash-u లక్ష
(అయిబాబోయ్ లచ్చే)



Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link