Aadhaarama Anuraagama

ఆధరమా అనురాగమా
నా జనుమకే అణుమూలమా
నీ తనువనే జీవాలయం
నను మోసిన దేవాలయం
అనుదినము నీ మధుర స్మృతులే
అనుదినము నీ మధుర స్మృతులే

ప్రతి రూపమై నిన్నే కని
పరిపూర్ణమై మురిసానని
జనుమ నీకు ఇవ్వాలని
జనుమ పొంది వచ్చానని
అనుదినము నీ మధుర స్మృతులే
అనుదినము నీ మధుర స్మృతులే

లాలించని పాలించని
నీ ప్రేమయే జగత్కారిణి
జనుమ నాకు ఇవ్వాలని
జనుమ పొంది వచ్చావని
అనుదినము నీ మధుర స్మృతులే

అమ్మతనం కమ్మదనం
అమృతమే అడగనా
ఎండమావి మిలమిలలో
నా కలలే వెతకనా
మరల నా బాల్యము దొరకునా
మమత ఒడి నీడన ఆదమరిచే
ఆశ నిజమే అగునా
పనిస
రిరిరి
సని
మపమగ
పనిస
గరి
రిసని
సని

ఆధరమా అనురాగమా
నా జనుమకే అణుమూలమా
నీ తనువనే జీవాలయం
నను మోసిన దేవాలయం
అనుదినము నీ మధుర స్మృతులే



Credits
Writer(s): Ramajogayya Sastry, Ghibran
Lyrics powered by www.musixmatch.com

Link