Okanoka Illu

ఒకానొక ఇల్లు ఉందంట
జల్లు కూడ తట్టుకోదంట
ఓ రాత్రి ఓ పిడుగు మీద పడెనంట
క్షణంలోన ఇల్లు కూలేనట
ఓ రోజు ఒకానొక ఏటి మీద
ఒక నావ సాగుతుంటే
వెల్లువొచ్చి యేరు పొంగి నావ మునిగెనే
ఒకే ఒక చెట్టు కింద
ఊరి జనం ఒదిగిరంట
చెట్టు కొమ్మ విరిగెనంట కథ ముగిసెనే
ముగిసినావన్నీ మళ్ళీ మొదలైయ్యేదెప్పుడో
తలచినావన్నీ ఇక జరిగేది ఎన్నడో
నా ఆశ ఒకటే నేనానందంలో తేలుతూ
ఒక రోజైనా ఉంటే చాలులే చాలు

అంతులేని ఓ శోకాన నే దారి లేక తెన్ను లేక తేలనా
మోడుబారిన లోకాన నే కొత్త కొత్త చిగురులు చూడనా
మంటలోన నే వేగుతుండగా ఓ సుడిగాలి నన్ను నేడు తాకెనా
చింతలోన నే చిక్కి ఉండగా ఆ చిక్కులన్నీ నేడు వీడునా
ఆ పొగమంచే కారు చిచ్చులాగ మారినదే
నా గుండెల్లో శోక కడలి పొంగెనే
వాడిన ఆ పూలే మళ్ళీ మళ్ళీ విరబూయునో
కోరినావన్నీ నాకేనాడు దొరకునో
నా ఆశ ఒకటే నేనానందంలో తేలుతూ
ఒక రోజైనా ఉంటే చాలులే
ముగిసినావన్నీ మళ్ళీ మొదలైయ్యేదెప్పుడో
తలచినావన్నీ ఇక జరిగేది ఎన్నడో
నా ఆశ ఒకటే నేనానందంలో తేలుతూ
ఒక రోజైనా ఉంటే చాలులే చాలు



Credits
Writer(s): Anirudh Ravichander, Rajshri Sudhakar
Lyrics powered by www.musixmatch.com

Link