Upaayame

ఉపాయమే తెలియదే అపాయమే నచ్చదే
నిప్పని తెలిసి కూడా నడకే ఆగదే
మరో దారి తెలియదే మంచి దారి కుదరదే
తప్పని తెలిసి కూడా తపనే తప్పదే
నీలో ఉన్న బలం అదే నిన్నే నేడు నడిపెలే
దేవుడిని విసిగించేటి చొరవే లేదులే
తప్పు ఏదో తెలియదే నీకే ఒప్పు ఏదో తెలియదే
చక్కగా సర్దుకుపోయే నైజం నీదిలే
ఇక సాగాలి సాగాలి వేరే దారే లేదే
ఇక సాగాలి సాగాలి వేరే దారే లేదే
ఇక సాగాలి ధైర్యంగా నీవే ముందుకు నేడే
తప్పని తెలిసి కూడా తపనే తప్పదే
నీ ప్రాణాలే ఆపదలో ఉన్నా భయమే లేదే
నీ ప్రాణాలే ఆపదలో ఉన్నా భయమే లేదే
నీ ఎదలోనా అలజడులే ఉన్నా దిగులే లేదే
చక్కగా సర్దుకుపోయే నైజం నీదిలే

ఎవ్వరేమనుకున్నా నీ మనసు వద్దన్నా
ముళ్లే ఉన్న దారి నువ్వే ఎంచుకున్నావే
గుండెలో తెగువున్నా చేతిలో బలమున్నా
గోతిలో నిన్ను నువ్వే తోసుకున్నావే
కష్టాలన్నీ నిన్నే వెంటాడుతూ ఉంటే
కష్టాలన్నీ నిన్నే వెంటాడుతూ ఉంటే
నీకింక దారే లేక ఇరుక్కుపోయావే
నడి సంద్రాన నావ మునుగుతున్నా
ఆశ అనే ఒడ్డు చేర్చే ఓటముంటాదే...
ఇక సాగాలి సాగాలి వేరే దారే లేదే
ఇక సాగాలి సాగాలి వేరే దారే లేదే
ఇక సాగాలి ధైర్యంగా నీవే ముందుకు నేడే
తప్పని తెలిసి కూడా తపనే తప్పదే
నీ ప్రాణాలే ఆపదలో ఉన్నా భయమే లేదే
నీ ప్రాణాలే ఆపదలో ఉన్నా భయమే లేదే
నీ ఎదలోన అలజడులే ఉన్నా దిగులే లేదే
చక్కగా సర్దుకు పోయే నైజం నీదిలే
ఉపాయమే తెలియదే అపాయమే నచ్చదే
నిప్పని తెలిసి కూడా నడకే ఆగదే
మరో దారి తెలియదే
మంచి దారి కుదరదే
తప్పని తెలిసి కూడా తపనే తప్పదే



Credits
Writer(s): Anirudh Ravichander, Rajshri Sudhakar
Lyrics powered by www.musixmatch.com

Link