Kodithe Kottali - From "Tagore"

కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి

బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి
ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ
చిందే వెయ్యాలీ నటరాజులాగా
నవ్వే చిందాలీ నెలరాజులా
మనసే ఉండాలీ మహరాజులాగా
ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ

కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి

చేయ్యి ఉంది నీకు చేయ్ కలిపేటందుకే
చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే
ఆరాటం నీకుంది ఏ పనైనా చేయడనికే
అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే
ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
పొందే ఫలాన్ని పంచివ్వాలి
అందరి సుఖాన్ని నువ్వే చూడాలి
ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి

పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
ప్రతిభ ఉన్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే

కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి

బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి
ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ
చిందే వెయ్యాలీ నటరాజులాగా
నవ్వే చిందాలీ నెలరాజులా
మనసే ఉండాలీ మహరాజులాగా
ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ



Credits
Writer(s): Bose S Chandra, Sarma Mani
Lyrics powered by www.musixmatch.com

Link