Cheliya Adugudhama

చెలియా అడుగుదామా
చలినే కాస్త పెరగమని
ఇదిగో తరుణం
ఇకపై జ్వలనం

సఖియా తెలుపుదామా
సుధనే కాస్త పొంగమని
ఇదిగో అధరం
ఇకపై వదలం

ఓ సముద్రాలనే దాటే తుఫానల్లే రావే
సరాగాలనే మీటే స్వరంలాగా రావే
సమాయత్తమై నాకే సమీపంగా రావే
సమావేశమవు కాలంలోనే సమస్తాన్ని తేవే
సునంద దరికి దా దా
సరదా పవనమై వెళదాం
ఆహా ఓహో ఎహె ఆహా

సునందా కదలి దా దా
కలిసి కవనమే కడదాం
ఆహా ఓహో ఎహె ఆహా

పగలంతా ప్రేమించేసే పిచ్చిదాన్ని నేనే
రాతిరంతా వేచి చూసే రతి నేనే
ఓ వెన్నెలంతా వెచ్చపెట్టి వెన్నపూస తీసి
జాబిలమ్మ తినిపించే మనతోనే
గది మొత్తం దుస్తులల్లె
గోడలపై చిత్రమల్లె
దేహంపై ఊపిరల్లె
పంచావే గురుతులే ఓఓ
చెలియా అడుగుదామా
చలినే కాస్త పెరగమని
ఇదిగో తరుణం
ఇకపై జ్వలనం

సఖియా తెలుపుదామా
సుధనే కాస్త పొంగమని
ఇదిగో అధరం ఇకపై వదలం

కనుల నిప్పు గనుల
పనుల తేని సానముల
తనతో కలిసా తరువై విరిసా

క్షణమా ప్రేమ ధనమా
రణమా శాంతి కారణమా
సగమై నిలిచా జగమే మరిచా

ఓ సముద్రాలనే దాటే తుఫానల్లే రావే
సరాగాలనే మీటే స్వరంలాగా రావే
సమాయత్తమై నాకే సమీపంగా రావే
సమావేశమవు కాలంలోనే సమస్తాన్ని తేవే
సునందా దరికి దా దా
సరదా పవనమై వెళదాం
ఆహా ఓహో ఎహె ఆహా

సునందా కదిలి దా దా
కలిసి కవనమే కడదాం
ఆహా ఓహో ఎహె ఆహా

సునందా దరికి దా దా
సరదా పవనమై వెళదాం
ఆహా ఓహో ఎహె ఆహా

సునందా కదలి దా దా
కలిసి కవనమే కడదాం
ఆహా ఓహో ఎహె ఆహా



Credits
Writer(s): Chandrabose, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link