Nannu Veedi Etto

నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీరు లేనిదే, ఏరు లేదులే
శోకం లేనిదే, ప్రేమ లేదులే
నన్నే వీడి నిన్నే వీడి
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే

నువు లేని నింగిలో నాకింక ఏ ఇంద్రధనసులు లేవే
నువు లేని నేలలో నాకింక ఏ పచ్చదనము లేదే
నా ప్రాణ వాయువే నువ్వంట, నా ఊపిరల్లే నిండాలే
నా ప్రేమ దీపమే నువ్వంట, వెలుగల్లే ఉండిపోవే
అరె ఏం చేసానే గోరం, నేరం
మరి నీకు నాకు ఏంటీ దూరం
నువ్వంటే నాదే ఇంకో రూపం
నా మీదే నాకు రాదే కోపం
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే

నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా, నే కాలి బూడిదయ్యానే
నువ్వేమి చేసినా ఎదలోన నా ప్రేమ కాలిపోదే
ఒక గంట నువ్వు నను కాదంటే, ఒకరోజు వేచి ఉంటానే
ఒక జన్మ నువ్వు నను కాదంటే, పది జన్మలెత్తుతానే
నా ప్రాణాంనంతా గొంతే చేసి
నా ప్రేమే నీకు చెప్పేస్తున్నా
ఈ ప్రాణం గాల్లో కలిసేలోగా
నీ ప్రేమే నాకు చెప్పేస్తావా
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీరు లేనిదే, ఏరు లేదులే
శోకం లేనిదే, ప్రేమ లేదులే
నన్నే వీడి నన్నే వీడి నన్నే వీడి
ఎటో వెళ్ళినావే
ఎటో వెళ్ళినావే
నన్నే వీడి



Credits
Writer(s): Harris Jayaraj, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link